ఏటూరునాగారం సర్పంచ్‌గా BRS అభ్యర్థి
MLG: ఏటూరునాగారం సర్పంచ్ ఎన్నికల్లో BRS పార్టీ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత 3,230 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆమె ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గుడ్ల శ్రీలతపై గెలుపొందారు. మొత్తం 8,333 ఓట్లు పోల్ కాగా, బీఆర్ఎస్ అభ్యర్థికి 5,520, కాంగ్రెస్ అభ్యర్థికి 2,330, బీజేపీకి 64 ఓట్లు వచ్చాయి. అక్కడ మంత్రి సీతక్క ఐదు సార్లు ప్రచారం చేసినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందలేదు.