ప్రధాన కాలువ ద్వారా నీటి విడుదల
KMR: జుక్కల్ మండలం కౌలాస్ నాలా ప్రాజెక్టులో నీటిమట్టం నిలకడగా ఉన్నట్లు ప్రాజెక్ట్ ఏఈ సుకుమార్ రెడ్డి సోమవారం తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు ఉన్నట్లు చెప్పారు. ప్రధాన కాలువ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు పేర్కొన్నారు. ఇన్ ఫ్లో 100 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందన్నారు. నీటి సామర్థ్యం 1.237 టీఎంసీలుగా ఉన్నట్లు చెప్పారు.