మౌలిక వసతులు లేవని నిరసన

మౌలిక వసతులు లేవని నిరసన

మేడ్చల్: నాగారం మున్సిపాలిటీలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో సరైన సౌకర్యాలు లేవని కాలనీవాసులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుమారు 2000 కుటుంబాలు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని.. వీధిలైట్లు, డ్రైనేజీ వ్యవస్థ, బస్సు సౌకర్యం వంటి మౌలిక వసతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు దీనిపై స్పందించి మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు.