ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

JGL: జగిత్యాల పట్టణంలోని నటరాజ్ చౌరస్తాలో శుక్రవారం ఆర్టీసీ బస్సు ఢీకొని కృష్ణమూర్తి అనే హనుమాన్ దీక్షాపరుడు మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. జగిత్యాల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.