కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే
సిరిసిల్ల: రుద్రంగి మండల కేంద్రంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తన స్వగ్రామమైన రుద్రంగిలో ఆయన సతీమణి, చందుర్తి మాజీ జడ్పీటీసీ సభ్యురాలు ఆది వనజ, కుమారుడితో కలిసి ఆయన ఓటు వేశారు.