ఆర్టీసీ బస్సు ఢీకొని యువతి మృతి

ఆర్టీసీ బస్సు ఢీకొని యువతి మృతి

MDCL: ఆర్టీసీ బస్సు ఢీకొని యువతి మృతి చెందిన ఘటన కండ్లకోయ సమీపంలో జరిగింది. మేడ్చల్‌ పరిధిలోని గిర్మాపూర్‌కి చెందిన ముక్కెర కీర్తన(20) ఈ ప్రమాదంలో మృతి చెందింగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. కీర్తన తన చిన్నాన్న ప్రభాకర్, సోదరితో కలిసి బైక్‌పై గిర్మాపూర్ నుంచి మూసాపేటకు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన ఇద్దరిని ఆసుపత్రకి తరలించారు.