నేడు భూ సమస్యలపై వినతుల స్వీకరణ

KRNL: సి. బెళగల్ మండలంలో ఇవాళ పరిష్కార ఫిర్యాదుల వేదిక నిర్వహించనున్నారు. సచివాలయం - 2 భవనంలో తహసీల్దారు వెంకటలక్ష్మి అధ్యక్షతన మండల స్థాయి పరిష్కార ఫిర్యాదుల వేదిక నిర్వహిస్తున్నట్లు ఉప తహసీల్దారు పురుషోత్తం తెలిపారు. మండలంలోని రైతులు పట్టాదారు పాసు పుస్తకాలకు, ఇతర భూసమస్యలపై శుక్రవారం వినతులు అందించవచ్చన్నారు.