ఇళ్ల కూల్చివేత.. స్థానికులు ఆందోళన
TG: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు అధికారులు యత్నించారు. హైకోర్టు ఆదేశాలతో ఇళ్ల కూల్చివేతలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. కానీ, స్థానికులు జేసీబీలను అడ్డుకుని రాస్తారోకో చేపట్టారు. దీంతో పోలీసులు, స్థానికుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.