గుంతకల్లులో గ్రామ రెవెన్యూ సహాయకుల ధర్నా

గుంతకల్లులో  గ్రామ రెవెన్యూ సహాయకుల ధర్నా

ATP: గుంతకల్లు MRO కార్యాలయం ఎదుట శుక్రవారం గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అర్హత ఉన్న VRAలకు పదోన్నతి కల్పించాలని, పే స్కేల్ లేదా కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, T.A, D.A చెల్లించాలని విన్నవించారు. తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.