వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం
RR: నార్సింగి పరిధిలోని సంకటహరణ శ్రీ హనుమాన్ దేవాలయంలో సీతాలక్ష్మణ హనుమత్సమేత శ్రీ కోదండ రామచంద్రస్వామి నూతన దేవాలయం, విగ్రహాలు, ధ్వజస్తంభం ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకుని ప్రతిష్టాపనలో పాల్గొన్నారు. దేవాలయంలో నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.