మెట్టుపల్లె గ్రామంలో పర్యటించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు

NDL: అవుకు మండలం మెట్టుపల్లె గ్రామంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి శనివారం పర్యటించారు. గ్రామంలో ఉన్న శ్రీ భూలక్ష్మి సమేత చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి కాటసాని రాంభూపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.