విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

KMM: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కి గురై ఓ యువకుడు మృతిచెందాడు. తిరుమలాయపాలెం మండలం మేడిదపల్లిలోని ఓ వ్యక్తి ఇంట్లో వివాహం జరగగా స్టేజీ తొలగించేందుకు కారేపల్లికి చెందిన అజ్మీరా విజయ్ కుమార్ (24) నిన్న కూలీపనులకు వచ్చాడు. స్టేజీ తొలగిస్తుండగా సమీపాన 11 కేవీ లైన్‌ను గమనించకపోవడంతో ఇనుప పోల్ దానికి తాకగా షాక్‌కు గురై మృతి చెందాడు.