ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్
ADB: నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేందుకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాలు అందిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. పీఎంఈజీపీ, ముద్రా వంటి పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. ఎస్సీ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలు, పాడి పశువులు, సోలార్ ఫామ్స్ వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు.