నంది వాహనంపై కీసరకు శివయ్య ప్రయాణం

నంది వాహనంపై కీసరకు శివయ్య ప్రయాణం

MDCL: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి ఉత్సవమూర్తి నంది వాహనంపై కీసరకు వేంచేశారు. ఇది తరతరాల నుంచి వస్తున్న ఆనవాయితీ అని నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం రాత్రి కీసరగుట్ట నుంచి పోలీసు బందోబస్తు నడుమ డప్పు చప్పుళ్లతో ముదిరాజ్ కులస్థులు తమ భుజాలపై హర హర మహాదేవ అంటూ.. స్వామి వారిని కీసరగుట్ట నుంచి నడక దారిలో తీసుకోచ్చారు.