ఆలయాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: మంత్రి
MHBD: ఆలయాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. మంత్రి కొండా సురేఖను కురవి వీరభద్రస్వామి ఆలయ పురోహితులు, నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. వీరభద్రస్వామి ఆలయ సమగ్ర అభివృద్ధికి సహకరిస్తామని, ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు.