అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

కర్నూల్: ఆదోని రైల్వేస్టేషన్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున ఎస్సై గోపాల్ తమ సిబ్బందితో కలిసి తనిఖీ చేస్తుండగా ఆదోనికి చెందిన బోయ నర్సింహులు, బోయ రవి తమ బ్యాగుల్లో 6బాక్సుల కర్ణాటక మద్యం తరలిస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మద్యం రూ.27,950 ఉంటుందని తెలిపారు.