'దైవ ప్రార్థనలు ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయి'

JN: మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ముస్లిం సోదరులందరికీ ఆయన రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లింలు పాటించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.