అడవి పంది దాడి.. ఐదుగురికి తీవ్ర గాయాలు

SRD: అడవి పంది దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలైన ఘటన వట్‌పల్లి మండలం పోతులబొగడ గ్రామంలో గురువారం జరిగింది. గ్రామంలో హఠాత్తుగా చొరబడిన అడవి పంది ఆరు బయట కూర్చున్న 5 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయ పరిచింది. వట్పల్లిలో వారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫస్ట్ ఎయిడ్ చికిత్సలు నిర్వహించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.