VIDEO: ప్రత్తిపాడులో భారీ అగ్నిప్రమాదం

VIDEO: ప్రత్తిపాడులో భారీ అగ్నిప్రమాదం

GNTR: ప్రత్తిపాడులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక బస్టాండ్ ఎదురుగా ఉన్న పాత సామాన్ల దొడ్డిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు తీవ్రరూపం దాల్చి ఆకాశాన్ని అంటాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ హఠాత్పరిణామంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.