మాచవరంలో ‘బన్నూరు' రకం పొట్టి గొర్రెలు
కోనసీమ: అంబాజీపేట మండలం మాచవరంలో కర్ణాటకకు చెందిన 'బన్నూరు' రకం పొట్టి గొర్రెలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అడబాల ప్రేమ్ కుమార్ ఒక్కొక్కటి రూ.25 వేలు పెట్టి వీటిని కొనుగోలు చేశారు. చిన్న పరిమాణం, ముద్దులొలికే రూపంతో ఉన్న ఈ గొర్రెలు ఇంటి ప్రాంగణంలో పెంచడానికి ఎంతో అనువుగా ఉన్నాయి.