కోడూరులో ఎరువుల షాపులపై విజిలెన్స్ దాడులు

కృష్ణా: కోడూరులో ఎరువుల షాపులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఒమర్, వ్యవసాయ అధికారి ఎం.శ్రీధర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా డిపోలో బిల్లుబుక్కులు, స్టాక్ రిజిస్టర్, ఈ-పాస్ మెషిన్, గ్రౌండ్ బ్యాలెన్స్ ట్యాలీ కాకపోవడంతో దాదాపు రూ.2 లక్షల విలువైన 13 మెట్రిక్ టన్నుల ఎరువులను అధికారులు సీజ్ చేశారు.