ఇరాన్‌ గ్యాస్‌ స్థావరాలపై దాడులు

ఇరాన్‌ గ్యాస్‌ స్థావరాలపై దాడులు

ఇరాన్‌లోని రెండు గ్యాస్ స్థావరాలపై దాడులు జరిగాయి. ఇస్ఫహాన్‌లోని గ్యాస్ వ్యవస్థ, ఖొర్రమ్‌షహర్‌లోని పవర్ ప్లాంట్‌ను క్షిపణులు తాకాయి. ఇవి ఎవరు చేశారన్న దానిపై స్పష్టత లేదు. అయితే, ఇది ఇజ్రాయెల్ చేసిన పనేనని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇరాన్ విద్యుత్ వ్యవస్థలపై దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటన చేసినా.. ఈ దాడులు జరగడం గమనార్హం.