కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో ఎంపీ

ATP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ వేద పండితులు, అధికారులు ఎంపీని సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ఆశీస్సులు జిల్లా ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు ఎంపీ తెలిపారు.