మోరగుడి గ్రామానికి తాగునీటి కష్టాలు

KDP: మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. మోరగుడి గ్రామ తాగునీటి పైపులు పెన్నా నదిలో ఉన్నందున ఆ పైపులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. దీని కారణంగా గ్రామంలో నీటి సమస్య ఏర్పడింది. సమస్యను తెలుసుకున్న జమ్మలమడుగు టీడీపీ ఇన్‌ఛార్జ్ భూపేశ్ ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయించారు. అయితే శాస్వత పరిష్కారం చూపాలన్నారు.