వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి

VKB: వినాయక మండపాలను ఏర్పాటు చేసే వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు తప్పకుండా అనుమతులు తీసుకొని ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని దుద్యాల ఎస్సై యాదగిరి అన్నారు. వినాయక మండపాల ఏర్పాటు కోసం రాష్ట్ర పోలీస్ శాఖ ఒక వెబ్‌సైట్ ఏర్పాటు చేసిందని ఆ వెబ్‌సైట్ వివరాలను నమోదు చేసుకుంటే అనుమతి లభిస్తుందన్నారు.