ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌కు ప్రభుత్వం కీలక పదవి

ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌కు ప్రభుత్వం కీలక పదవి

కోనసీమ: ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌కు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి అప్పగించింది. ఎస్సీ సంక్షేమ అభివృద్ధి జాయింట్ కమిటీ సభ్యుడిగా ఇజ్రాయిల్ నియమితులయ్యారు. ఈ మేరకు తనను నియమిస్తూ ఆదేశాలు అందాయని ఆయన ఆదివారం తెలిపారు. ప్రభుత్వం అప్పగించిన ఈ బాధ్యతాయుత పదవిని తాను సక్రమంగా నిర్వర్తిస్తానని ఆయన అన్నారు. పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.