గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడి అరెస్టు

గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడి అరెస్టు

ADB: గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ వన్ టౌన్ సీఐ సునిల్ కుమార్ తెలిపారు. పట్టణంలోని నటరాజ్ టాకీస్ వద్ద గంజాయి విక్రయిస్తున్న స్థానిక చిలుకూరి లక్ష్మీనగర్‌కు చెందిన షేక్ ఆమేర్‌పై గత నెల 15న కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పరారీలో ఉన్న ఆమేర్‌ను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌‌కు తరలించినట్లు తెలిపారు.