ఆశ్రమ పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

ఆశ్రమ పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

MHBD: మరిపెడ మండలంలోని ఆశ్రమ పాఠశాలలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు జూనియర్ విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. పాఠశాల ఎదుట బాధిత విద్యార్థుల పేరెంట్స్ ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.