భారత్ ముంగిట ఒక్క ట్రోఫీ, 2 రికార్డులు

భారత్ ముంగిట ఒక్క ట్రోఫీ, 2 రికార్డులు

అంచనాలకు తగ్గట్టుగా భారత్ మళ్లీ T20 WC ఫైనల్‌కు చేరి, రేపు న్యూజిలాండ్‌తో తలపడేందుకు సిద్ధమైంది. అయితే టోర్నీలో ఇప్పటివరకు డిఫెండింగ్ ఛాంపియన్ కానీ, ఆతిథ్య జట్టు కానీ టైటిల్ గెలవలేదు. ఈ సారి భారత్ డిఫెండింగ్ ఛాంపియన్, అలాగే టోర్నీ ఆతిథ్య జట్టు. ఈ నేపథ్యంలో రేపటి తుదిపోరులో సూర్యసేన గెలిస్తే.. 19 ఏళ్ల T20 WC చరిత్రలో ఏ జట్టుకూ సాధ్యం కాని ఈ 2 ఘనతలను అందుకుంటుంది.