రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

MNCL: బెల్లంపల్లి పట్టణంలో కన్నాలబస్తీకి చెందిన సిలువేరు రవితేజ (30) అనే యువకుడు రైలు కిందపడి ఇవాళ ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రవితేజకు ఇటీవల పెళ్లి కుదిరిందన్నారు. కాగా అమ్మాయి వేరే కులానికి చెందిన వారు కావడంతో మృతుడి కుటుంబ సభ్యులు పెళ్ళికి ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపం చెంది రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.