డిగ్రీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
HNK: హసన్‌పర్తిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులై, వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలు మించని మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.