'అర్హులైన ప్రతి పేదవాడికి సామాజిక పింఛన్లు'
ELR: అర్హులైన ప్రతి పేదవాడికి సామాజిక పింఛన్లు అందిస్తామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గ కూటమి నేతలు, ప్రజలు మర్యాదపూర్వకంగా వినతులను అందజేశారు. దీంతో ప్రజలు అందించే ప్రతి సమస్యను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.