'పరికరాలు లేని ఆసుపత్రులు ప్రజలకు ఎలా ఉపయోగం'

'పరికరాలు లేని ఆసుపత్రులు ప్రజలకు ఎలా ఉపయోగం'

VZM: జిల్లా సర్వసభ్య సమావేశంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఆసుపత్రుల పరిస్థితిపై గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్.కోట, గజపతినగరం మండలాల్లో కొత్త ఆసుపత్రి భవనాలు ప్రారంభించినప్పటికీ అవసరమైన వైద్య పరికరాలు ఇంకా అందుబాటులోకి రాలేదని తెలిపారు. కొత్త భవనాలు ఉన్నప్పటికీ వైద్య సేవలు ఇంకా పాత సీహెచ్‌సీ బ్లాకుల్లోనే కొనసాగుతున్నాయన్నారు.