అక్రమ మట్టి తవ్వకాన్ని అడ్డుకున్న రైతులు
KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం శివారులోని మంగల్‌పేట్ ప్రాంతం నుంచి మట్టిని అక్రమంగా తరలించుకుపోవడాన్ని గమనించిన స్థానిక రైతులు అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఓ కాంట్రాక్టర్ మట్టిని సైదాపూర్ మండలం రోడ్డుకు తరలిస్తున్నట్లు తెలుసుకుని అడ్డుకోవడంతో ఆ కాంట్రాక్టర్ జేసీబీ యంత్రాలు, ట్రాక్టర్లు వెనక్కి తిరిగిపోయాయి.