జవహర్ లిప్ట్ ఇరిగేషన్‌తో తీరనున్న మధిర రైతుల కష్టాలు

KMM: గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినప్పటికీ ప్రజా ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం వంగవీడులో జరిగిన సమావేశంలో మాట్లాడారు. జవహర్ ఎత్తిపోతల పథకంతో రైతుల సాగు నీటి కష్టాలు తీరనున్నాయని , ఆయకట్టు రైతులకు సాగునీరు అంది మధిర, ఎర్రుపాలెం మండలాలు రెండు పంటలతో సస్యశ్యామలం కానున్నాయని తెలిపారు.