మహాసభలు జయప్రదం చేయాలి

WNP: భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ జిల్లా మూడో మహాసభలు జయప్రదం చేయాలని పార్టీ నాయకులు ఎండీ కుతుబ్ ఆదివారం అమరచింత మండలంలోని కొంకనివాని పల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. జూలై 23, 24 తేదీల్లో ఆత్మకూరులో నిర్వహించే మహాసభలకు ప్రజలు వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున హాజరై మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంజి, మహేష్ పాల్గొన్నారు.