ఆ దాడి మా పనే: ఉక్రెయిన్
నల్ల సముద్రంలో రష్యా ఆయిల్ ట్యాంకర్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి తమ పనేనని ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ నౌకల వల్లే యుద్దం చేయడానికి రష్యాకు పెద్ద మొత్తంలో డబ్బు సమకూరుతోందని ఆరోపించింది. అందుకే వీటిని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కోసం అమెరికా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ దాడి జరగటం గమనార్హం.