కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
SRCL: బోయినపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, వంట గది, బియ్యం, పప్పులు, గుడ్లు ఇతర ఆహార పదార్థాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజన సమయం కావడంతో మెనూ పరిశీలించి.. కలెక్టర్ ప్లేట్ తీసుకొని భోజనం తీసుకుని విద్యార్థులతో కలిసి కింద కూర్చొని తిన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.