VIDEO: ఫోన్‌లో రీల్స్ చూస్తూ అడ్డంగా దొరికిపోయిన ASI
JGL: జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఏఎస్సై చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో కలకలం రేపింది. ప్రజలు తమ సమస్యలను విన్నవించేందుకు 'ప్రజావాణి'కి తరలివచ్చిన సమయంలో, విధి నిర్వహణలో ఉన్న ఓ ASI బహిరంగంగా ఫోన్‌లో రీల్స్ చూస్తూ అడ్డంగా దొరికిపోయాడు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి చర్యకు పాల్పడటంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.