శ్రీకాకుళం నుంచి పూరికి ప్రత్యేక రైలు

SKLM: పూరి జగన్నాథ స్వామి రథయాత్ర సందర్భంగా శ్రీకాకుళం నుంచి ప్రత్యేక రైలు ప్రారంభమైనట్లు రైల్వే శాఖ అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం - పూరి(08314)మధ్య స్పెషల్ ట్రైన్ జూన్ 28, జూలై 5, 6 తేదీల్లో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ రైలు జిల్లాలోని శ్రీకాకుళం రోడ్డు, పలాస మందస, కోటబొమ్మాలి వంటి స్టేషన్లో ఆగనుందని రైల్వే శాఖ పేర్కొంది.