చెరువు గట్టు తెగిపోతున్న పట్టించుకోరా..?

చెరువు గట్టు తెగిపోతున్న పట్టించుకోరా..?

VKB: వికారాబాద్ మండలం పాతూరు చెరువు గట్టు ప్రమాదకర స్థితిలో ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండురోజులుగా ఇరిగేషన్ శాఖ అధికారులకు పలుమార్లు సమాచారం ఇచ్చినా స్పందన లేకపోవడంతో గ్రామస్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చెరువుగట్టు ఒకవైపు వంగి తెగిపోయే పరిస్థితి ఉందని, అధికారులు స్పందించకపోతే గ్రామానికి పంటలకు నష్టం తప్పదని హెచ్చరించారు.