విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్
BHPL: రేపటి నుంచి ప్రారంభమవుతున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను రాయనున్న విద్యార్థులకు కలెక్టర్ రాహుల్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు భయం లేకుండా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. సరైన ప్రణాళికతో చదవడం, సమయపాలన పాటించడం ముఖ్యమని, ఇప్పటి వరకు చేసిన చదువుపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా రాస్తే మంచి ఫలితాలు సాధ్యమని పేర్కొన్నారు.