ఈనెల 7న సెపక్ తక్రా ఎంపిక పోటీలు

ఈనెల 7న సెపక్ తక్రా ఎంపిక పోటీలు

ASF: రెబ్బెన మండలం గోలేటిలో ఈనెల 7న సెపక్ తక్రా ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాస్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన సీనియర్ పురుషులు, మహిళా క్రీడాకారులు ఈనెల 20 నుంచి 22 వరకు అంతర్ జిల్లాల పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఆసక్తి గల జిల్లా క్రీడాకారులు సకాలంలో హాజరు కావాలని సూచించారు.