కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

SRCL: గంభీరావుపేటలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. ధాన్యం నిల్వలు పరిశీలించి, రైతులతో మాట్లాడారు. ఇప్పటిదాకా ఎన్ని క్వింటాళ్ల ధాన్యం రైస్ మిల్లులకు తరలించారో అధికారులతో ఆరా తీశారు. జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్ మారుతి రెడ్డి, ఎంపీడీవో రాజేందర్ పాల్గొన్నారు.