రేపు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ పాలకవర్గ సమావేశం

SRD: జిల్లాలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ పాలకవర్గ సమావేశం శనివారం రాత్రి 7 గంటలకు ఆర్యవైశ్య భవన్‌లో జరుగుతుందని ఆలయ కమిటీ ఛైర్మన్ తోపాజి అనంత కిషన్ శుక్రవారం తెలిపారు. ఈ నెల 7వ తేదీన జరిగే అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలపై సమావేశంలో చర్చ జరుగుతుందని చెప్పారు. పాలకవర్గ సభ్యులు సమావేశానికి సకాలంలో హాజరుకావాలని కోరారు.