భారీ వర్షాలకు కూలిన పాఠశాల ప్రహరీ గోడ

MBNR: జడ్చర్ల పట్టణంలోని ప్రాథమిక పాఠశాల కొత్త బజారు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియం ప్రహరీ గోడ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలిపోయింది. పాములు, విష జీవులు పాఠశాలలోకి వస్తుండటంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ప్రహరీ గోడను త్వరగా నిర్మించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.