రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ELR: కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన బాలం పవన్ సాయి కిషోర్ ఎదురుగా వెళ్తున్న వాసాల ట్రాక్టర్ ఒక్కసారిగా ఆగి రివర్స్ చేయడంతో వెనుక నుంచి ఢీ కొట్టాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.