మాజీ సీఎంకు నివాళులర్పించిన కలెక్టర్
BHNG: ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోశయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు అన్నారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన రోశయ్య వర్ధంతి కార్యక్రమానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.