'అనారోగ్యంతో మృతి చెందిన అడ్వకేట్‌కు నివాళులు
NDL: పగిడ్యాల మండలo, బీరవోలు గ్రామ అడ్వకేట్ నీలకంఠేశ్వర రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. సమాచారం అందుకున్న మండల మాజీ ZPTC, వైసీపీ నాయకులు పుల్యాల నాగిరెడ్డి నేడు గ్రామానికి చేరుకొని నీలకంఠేశ్వర రెడ్డి పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు కలిగిన వ్యక్తి అని కొనియాడారు.