తంబళ్లపల్లె ICTC బృందానికి ప్రశంస
అన్నమయ్య: ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా తంబళ్లపల్లె ప్రభుత్వాసుపత్రి ICTC బృందానికి ఉత్తమ సేవలందినందుకు ప్రత్యేకంగా గుర్తింపు లభించింది. కౌన్సిలర్ చంద్రమోహన్, ల్యాబ్ టెక్నీషియన్ బాలాజీ సోమవారం రాయచోటిలో అడిషినల్ DMHO రాధిక చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందుకున్నారు. జిల్లా ICTC సిబ్బంది, కృషి సంస్థ సభ్యులు వారిని అభినందించారు.